Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 10:13 AM

శస్త్రచికిత్స వికటించి యువతి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన.

19-07-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం ఓ మహిళ మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రిలో కలకలం రేపింది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనెతండాకు చెందిన మంజుల (23) కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శనివారం ఆపరేషన్ అనంతరం తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు మంజుల వైద్యులకు తెలిపినా, యాంటీబయాటిక్ మందులు మాత్రమే ఇచ్చారని, ఆ మందులు తనకు పడవని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు నీలాద్రి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Sthanikam

శస్త్రచికిత్స వికటించి యువతి మృతి.. వైద్యుల నిర్లక్ష్యమంటూ బంధువుల ఆందోళన.

Article Image

హయత్‌నగర్,

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం ఓ మహిళ మృతి చెందిన ఘటన హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రిలో కలకలం రేపింది. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనెతండాకు చెందిన మంజుల (23) కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, శనివారం ఆపరేషన్ అనంతరం తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు మంజుల వైద్యులకు తెలిపినా, యాంటీబయాటిక్ మందులు మాత్రమే ఇచ్చారని, ఆ మందులు తనకు పడవని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యమే మంజుల మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు నీలాద్రి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News