Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:10 PM

మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ బాలికల సంఘ సభ్యులకు మోడల్ పార్లమెంట్ నిర్వహణ

30-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో స్నేహ (బాలికల) సంఘాల సభ్యులకు మోడల్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, శాసనసభల పనితీరు, చట్టాల రూపకల్పన ప్రక్రియపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికలు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సభాపతుల పాత్రలను పోషిస్తూ వివిధ అంశాలపై చర్చలు జరిపారు. బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పార్లమెంటరీ విధానాలను అనుసరిస్తూ నిజమైన పార్లమెంట్ సమావేశాల అనుభూతిని పొందారు. ఈ కార్యక్రమం ద్వారా చట్టాలు ఎలా రూపొందుతాయి, ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందనే అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందడంతో పాటు నాయకత్వ లక్షణాలు, ప్రసంగ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయ సామర్థ్యాలు పెంపొందించుకునే అవకాశం కలిగింది. ప్రజాస్వామ్య విలువలు, సహనం, సమిష్టి నిర్ణయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, విద్యాశాఖ, పోలీసు శాఖ అధికారులు, జిల్లా మరియు మండల స్థాయి సిబ్బంది, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ బాలికల సంఘ సభ్యులకు మోడల్ పార్లమెంట్ నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News