Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

30-05-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, : ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాల గుర్తింపును రద్దు చేసి చర్యలు తీసుకోవాలని డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మిగనూరు సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో పని చేయించుకోవడం, సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డులతో ప్రవేశాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఫీజుల పట్టిక ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం చేసుకుంటూ విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని ఆరోపించారు.

విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే విద్యాశాఖ కార్యాలయం ఎదుట దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మల్లికార్జున, రంగస్వామి, విరేష్, ప్రవీణ్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి.డీఎస్‌ఎఫ్, పీడీఎస్‌ఓ నాయకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News