Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

రాష్ట్ర అవతరణ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు.

30-05-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి

జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జెండా ఆవిష్కరణ స్థలం, పరేడ్ గ్రౌండ్, సభా ప్రాంగణం, విద్యుత్, పారిశుధ్య సౌకర్యాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పరిశీలన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర అవతరణ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News