Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

పెన్షన్‌లో కేంద్ర వాటా రూ.5 వేలకు పెంచాలి: నంబు రాజన్

30-05-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికలాంగుల హక్కులను కుదించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్ట సవరణలను దేశవ్యాప్తంగా అడ్డుకుంటామని ఎన్‌పీఆర్‌డీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంబు రాజన్ హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్, మతోన్మాద విధానాలను అమలు చేస్తోందని, పేదల కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించకుండా యూడీఐడీ కార్డుల పంపిణీ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

వికలాంగుల పెన్షన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా ప్రస్తుతం రూ.300 మాత్రమే ఉందని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని దానిని రూ.5 వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డులు జారీ చేయాలని కోరారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం–2016 అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో జాప్యం చేస్తోందన్నారు. పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు పాస్, సహాయ పరికరాల పంపిణీ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వికలాంగులు, వారి పిల్లలకు 5 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని కోరారు.

సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్. వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. ఉపేందర్, సహాయ కార్యదర్శి జె. రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగా ప్రకాశ్, కోశాధికారి లలితతో పాటు వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పెన్షన్‌లో కేంద్ర వాటా రూ.5 వేలకు పెంచాలి: నంబు రాజన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News