సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చార్మినార్ జోన్ డీఎంహెచ్‌ఓగా సేవలందించిన ఆమె, బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కార్యక్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందుబాటు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
PRINT TIME: September 21, 2026 11:08 PM
సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి బాధ్యతల స్వీకరణ

30-05-2026
131 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ కే. లలితాదేవి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో చార్మినార్ జోన్ డీఎంహెచ్‌ఓగా సేవలందించిన ఆమె, బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో ఆరోగ్య సేవల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, కార్యక్రమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన వైద్య సేవల అందుబాటు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కష్టపడి పనిచేస్తూ సమయపాలన పాటించాలని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తూ సంగారెడ్డి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి