Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:54 PM

ఘనంగా పోచంపల్లి బ్యాంకు 16వ వార్షికోత్సవం!

30-05-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రూ. 68 కోట్ల వ్యాపారంతో ముందంజలో చౌటుప్పల్ బ్రాంచి

​ సైబర్ నేరాలపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి: బ్యాంక్ చైర్మన్ రమేష్

ఆన్‌లైన్ సేవలు, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పోచంపల్లి బ్యాంకు (చౌటుప్పల్ బ్రాంచి) శనివారం తన 16వ వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని బ్రాంచి కార్యాలయంలో ఖాతాదారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బ్యాంక్ చైర్మన్ రమేష్, బ్యాంకు సీఈఓ సీత శ్రీనివాస్ హాజరయ్యారు.

​ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ.. ఖాతాదారుల నమ్మకం, నిరంతర సహకారంతోనే బ్యాంకు నేడు ఈ స్థాయికి చేరుకుందని, పురోభివృద్ధి సాధించినందుకు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం చౌటుప్పల్ బ్రాంచి రూ. 68 కోట్ల భారీ వ్యాపార టర్నోవర్‌తో విజయవంతంగా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.​ సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దని అవగాహన కల్పించారు.సమయాన్ని ఆదా చేసుకునేందుకు బ్యాంకు అందిస్తున్న అత్యాధునిక ఆన్‌లైన్, డిజిటల్ సేవలను వినియోగించుకుని ఆర్థిక లావాదేవీలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. బ్యాంకులో డిపాజిట్ చేసి అధిక వడ్డీని పొందాలని, అలాగే బ్యాంకు అందిస్తున్న అన్ని రకాల రుణ సదుపాయాలను (గోల్డ్ లోన్, వ్యాపార, వ్యక్తిగత రుణాలు) అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.​"ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకు సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహకారం అందిస్తారు."ఈ వార్షికోత్సవ వేడుకల్లో చౌటుప్పల్ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ఇతర బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పోచంపల్లి బ్యాంకు 16వ వార్షికోత్సవం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News