Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

ఉద్యమకారులారా.. చలో బషీర్‌బాగ్.జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల ఫోరం

30-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేటి ప్రతినిధుల సదస్సుకు భారీగా తరలిరావాలని పిలుపు

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నేడు నిర్వహించనున్న ఉద్యమకారుల ప్రతినిధుల సదస్సుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు, నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.

ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల పదాధికారులు, తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, మహిళా నాయకులు, కళాకారులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.

సదస్సుకు కేకే కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కేకే కమిటీని ఏర్పాటు చేసినందుకు స్వాగతం తెలుపుతూ, కృతజ్ఞతాభావంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమకారుల కోసం రూ.12 వేల కోట్లతో ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 250 గజాల ఇంటి స్థలంతో గృహ నిర్మాణం, నెలకు రూ.25 వేల పెన్షన్, ఉద్యమ సమయంలో మరణించిన వారి కుటుంబాలకు, వికలాంగులైన ఉద్యమకారులకు ప్రత్యేక సహాయం అందించాలని కోరారు.

అర్హులైన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యమకారులకు తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sthanikam

ఉద్యమకారులారా.. చలో బషీర్‌బాగ్.జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల ఫోరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News