Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:10 PM

సేవలకు ఘన సత్కారం.. ఎస్‌ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలకు ఆత్మీయ వీడ్కోలు

30-05-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమంలో ఎస్‌ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ, పోలీసు శాఖకు వారు అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అంజిరెడ్డి 1989లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యసాహసాలతో విధులు నిర్వహించడంతో పాటు జిల్లా క్రైమ్ రికార్డు విభాగంలో విశేష సేవలందించి, ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా అంచెలంచెలుగా ఎదిగి సబ్‌ ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు. అలాగే వీరప్ప 1993లో ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీస్ కానిస్టేబుల్‌గా చేరి తనకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తూ హెడ్ కానిస్టేబుల్ స్థాయికి ఎదగడం వారి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ సుదీర్ఘ సేవా కాలంలో ఎలాంటి ప్రతికూల రిమార్కులు లేకుండా విధులు నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందడం అభినందనీయమని అన్నారు. పదవీ విరమణ అనంతరం వారు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ, పోలీసు శాఖ తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొని పదవీ విరమణ పొందిన అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

సేవలకు ఘన సత్కారం.. ఎస్‌ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్పలకు ఆత్మీయ వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News