Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:30 AM

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ

30-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కార్మిక, కూలీ వర్గాల హక్కుల సాధన కోసం సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) గత 56 ఏళ్లుగా నిరంతర పోరాటాలు సాగిస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ అన్నారు. సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఐటీయూ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత వంటి అనేక కార్మిక హక్కులు ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.

అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. కార్మికుల ఐక్యతే వారి బలమని, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరింత సంఘటితంగా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

నూతన లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్లు కార్మికుల హక్కులను హరించే విధంగా ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కనీస వేతనాల్లో శాస్త్రీయత లోపించిందని, పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాలను పునర్నిర్ణయించాలని కోరారు.

అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ భువనగిరి పట్టణ కన్వీనర్ గంధమల్ల మాతయ్య, ఆనగంటి వెంకటేష్, మల్లారెడ్డి, కొలుపుల నాగరాజు, ఎల్లేష్, శంకర్, వెంకటరత్నమ్మ, బిక్షపతి, దండు నరసింహ, మైసయ్య, రాములు, సుధాకర్, కాంతమ్మ, భాస్కర్‌తో పాటు వివిధ యూనియన్ల నాయకులు, కార్మికులు, సీఐటీయూ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక హక్కుల కోసం సీఐటీయూ పోరాటాలు ఆదర్శం. 56వ ఆవిర్భావ దినోత్సవంలో మాయ కృష్ణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News