Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:11 PM

సంగటన్ సృజన్ అభియాన్‌తో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

30-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన "సంగటన్ సృజన్ అభియాన్" కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడం, గ్రామ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని పొందే దిశగా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం సూచించిన మార్గదర్శకాల మేరకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

సంగటన్ సృజన్ అభియాన్‌తో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News