Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

లక్కారం వద్ద ఘోర ప్రమాదం: లారీ కిందపడి వృద్ధురాలు దుర్మరణం!

19-05-2026 506 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన అశోక్ లేలాండ్ వాహనం

​* అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన టైలర్ అనసూయ.. కుమారుడికి గాయాలు

​మండల పరిధిలోని లక్కారం గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...

డి.నాగారం గ్రామానికి చెందిన ఏనుగు అనసూయ (66) (భర్త దివంగత అంజిరెడ్డి) వృత్తిరీత్యా టైలర్‌గా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె తన కుమారుడు ఏనుగు వెంకట్ రెడ్డితో కలిసి ‘ప్యాషన్ ప్రో’ బైక్ (TG 30 A 7507) పై చౌటుప్పల్ కూరగాయల మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ఇద్దరూ కలిసి తిరిగి బైక్‌పై డి.నాగారం బయలుదేరారు.సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో వారి బైక్ జాతీయ రహదారి 65 (NH 65) పై లక్కారం గ్రామ పరిధిలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుంది. అదే సమయంలో చౌటుప్పల్ వైపు నుండి వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం (TS 05 UC 0018) డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బైక్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టాడు.​ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న తల్లి, కొడుకు ఇద్దరూ కిందపడిపోయారు. దురదృష్టవశాత్తూ కిందపడిన అనసూయ తలపై నుండి సదరు అశోక్ లేలాండ్ వాహనం దూసుకెళ్లడంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైక్ నడుపుతున్న వెంకట్ రెడ్డికి కుడి మోచేతికి, కుడికాలి బొటనవేలికి రక్తగాయాలయ్యాయి .ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బాధితులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి మరో కుమారుడు ఏనుగు లింగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

లక్కారం వద్ద ఘోర ప్రమాదం: లారీ కిందపడి వృద్ధురాలు దుర్మరణం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News