Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:12 PM

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

30-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి ప్రజా అవసరాల రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సీఎస్‌ఆర్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి జిల్లాకు పరిశ్రమల నుంచి వచ్చిన సీఎస్‌ఆర్ నిధులు, వాటి వినియోగం, ప్రస్తుత సంవత్సరానికి ప్రతిపాదించిన పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, వంటశాలలు, భోజనశాలలు, అదనపు తరగతి గదులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య వసతుల కల్పనకు నిధులు వినియోగించాలని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతిపాదిత పనుల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎస్‌ఆర్ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడేలా పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News