Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన
30-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ పథకాల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీబీనగర్‌లోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ కేంద్రంలో శనివారం చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జిల్లా న్యాయ సేవల అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయ సేవల సంస్థ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్ పాల్గొని వయోవృద్ధుల సంక్షేమ చట్టం, చట్టం ప్రకారం వారికి కల్పించిన హక్కులపై వివరించారు. న్యాయ సేవల సంస్థల ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని, 15100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సేవలు పొందే అవకాశం ఉందని తెలిపారు.

రెవెన్యూ డివిజన్ అధికారి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే వయోవృద్ధుల ట్రిబ్యునల్ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. జాగృతి పథకం ద్వారా చట్టాలు, హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, ఆశ పథకం ద్వారా బాల్య వివాహాల నివారణకు న్యాయ సేవలు అందిస్తున్నామని వివరించారు.

అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమంత్ వయోవృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి వైద్య సూచనలు అందజేశారు.

కార్యక్రమంలో ఆశ్రమ భవన కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, కార్యదర్శి కె. లింగారెడ్డి, ఇన్‌చార్జి మధుసూదన్‌రెడ్డి, వయోవృద్ధులు పాల్గొన్నారు.

Sthanikam

వయోవృద్ధులకు చట్టాలపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News