రేపు నల్లగొండలో ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్..
రేపు నల్లగొండలో ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్..
NM Yadav
‘ఏఐ ప్రోఫ్’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మార్గదర్శనం..
సొంత జిల్లా విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు..
ఐటీ టవర్‌లో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం: సంస్థ చైర్మన్ సాందీప్ కోణం..
నల్లగొండ : బీటెక్ చదవాలనుకునే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, వారికి సరైన కెరీర్ మార్గదర్శకత్వాన్ని అందించేందుకు నల్లగొండలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘ఏఐ ప్రోఫ్’ (AI Prof) సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ (ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి నల్లగొండ ఐటీ టవర్‌లో ‘ఇంజినీరింగ్ కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్’ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సాందీప్ కోణం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అబ్రిడ్జ్, కోణం ఫౌండేషన్ సంస్థల ద్వారా ఇప్పటికే ఎన్నో సేవలందించామని సాందీప్ కోణం వివరించారు. దేశంలోనే ప్రప్రథమంగా ‘ఏఐ ఆధారిత బీటెక్ ఎకోసిస్టమ్’ తో ‘ఏఐ ప్రోఫ్’ కంపెనీని నెలకొల్పామని.. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగాలు రాని ప్రస్తుత పరిస్థితులకు చెక్ పెట్టడమే మా లక్ష్యం. విద్యార్థులకు బీటెక్ మొదటి సంవత్సరం నుంచే పూర్తి స్థాయి ప్లేస్‌మెంట్ శిక్షణ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ‘ఏఐ ప్రోఫ్’ ఆవిర్భవించింది.
ప్రభుత్వ భాగస్వామ్యం.. సీఎం విజన్‌కు అండగా..
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచనలు, విజన్‌కు అనుగుణంగా తెలంగాణ యువతను ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని సాందీప్ తెలిపారు. ఇందులో భాగంగానే తమ సంస్థకు జేఎన్‌టీయూ (JNTU)తో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కూడా జరిగిందని ఆయన వెల్లడించారు.
సొంత నేలపై మమకారంతో ప్రత్యేక రాయితీలు..
తాను నల్లగొండ స్థానికుడు కావడంతో, గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నట్లు సాందీప్ తెలిపారు. ఈ ఏఐ ఆధారిత బీటెక్ కోర్సుల్లో సీట్లు పరిమితంగా ఉన్నాయి. తొలి దశ అడ్మిషన్లలో ముఖ్యంగా నల్లగొండ జిల్లా విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు, ఫీజు రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న ఈ సరికొత్త ఏఐ ఆధారిత బీటెక్ కోర్సుల అడ్మిషన్ల అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి