Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

వెలిమినేడులో కీ.శే. అంతటి అజయ్ కుమార్ గౌడ్ ప్రథమ వర్ధంతి

17-05-2026 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కీర్తిశేషులు అంతటి అజయ్ కుమార్ గౌడ్ (జననం: 25-05-1998) ప్రథమ వర్ధంతి వేడుకలు మే 18న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో జరగనున్నాయి. ఎల్లప్పుడూ ఉత్తేజపరిచే మాటలతో, కల్మషం లేని స్నేహంతో అందరి మనసులు గెలుచుకున్న అజయ్ కుమార్ (అజ్జి) జ్ఞాపకాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయని పేర్కొంటూ, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘన నివాళులర్పింనున్నారు.

వెలిమినేడులో నివాళులర్పించనున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు అంతటి అజయ్ కుమార్ గౌడ్ (అజ్జి) ప్రథమ వర్ధంతి వేడుకలు మే 18 (సోమవారం) నాడు వారి స్వగ్రామమైన వెలిమినేడులో అత్యంత విచారకరమైన వాతావరణంలో జరగనున్నాయి. 25-05-1998న జన్మించిన అజయ్ కుమార్ గత ఏడాది అకాల మరణం చెందడంతో, ఆయన మొదటి వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

మంచికి మారుపేరుగా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో అలసిన మనసులకు హాయినిస్తూ, స్నేహానికి నిజమైన నిదర్శనంగా నిలిచిన అజయ్ కుమార్ జ్ఞాపకాలను ఈ సందర్భంగా వారు నెమరువేసుకున్నారు. "నువ్వు మమ్మల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లినా.. నీ రూపం, నీ ఉల్లాసభరితమైన మాటలు, నీ స్నేహం ఎప్పటికీ మా హృదయాలలో నిలిచే ఉంటాయి" అని స్నేహితులు అత్యంత భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.

చిన్న వయసులోనే అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసిన అజయ్ కుమార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. శోకతప్త హృదయాలతో ఆయన కుటుంబ సభ్యులు మరియు స్నేహబృందం అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.

Sthanikam

వెలిమినేడులో కీ.శే. అంతటి అజయ్ కుమార్ గౌడ్ ప్రథమ వర్ధంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News