Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి

17-05-2026 364 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాంగ్‌రూట్‌లో వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..చౌటుప్పల్ కు చెందిన అన్నేబోయిన మల్లేష్ (45) హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. శనివారం డ్యూటీ ముగించుకొని తన సీబీజెడ్ బైక్‌ (ఏపీ13 ఎం 4987)పై తూప్రాన్‌పేట్ నుంచి చౌటుప్పల్‌లోని ఇంటికి బయలుదేరాడు.మార్గమధ్యలో ఖైతాపురం స్టేజి సమీపంలోని ఎన్హెచ్-65 హైవేపై ఉదయం సుమారు 10:45 గంటల సమయంలో రాంగ్‌రూట్‌లో అతివేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం చింతలకుంటలోని నాసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 1:47 గంటలకు మల్లేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతుడి భార్య అన్నేబోయిన అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధకుమార్ తెలిపారు.

Sthanikam

రాంగ్‌రూట్ వాహనం ఢీకొని పెట్రోల్ బంక్ ఉద్యోగి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News