Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

30-05-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను పెంచేందుకు నీటి సంరక్షణ చర్యలు ముమ్మరం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2025–26 నీటి సంవత్సరానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ తొలి సమావేశం శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులతో భూగర్భ జలాల అంచనా ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి అవసరమైన మౌలిక సమాచారాన్ని శాఖలు సమయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో సాధారణం కంటే 65 శాతం అధిక వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. భూగర్భ జలాల లభ్యతకు అనుగుణంగా రైతులు పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను నివారించవచ్చన్నారు. నవంబర్‌లో భూగర్భ జలాలు మూడు మీటర్ల లోతులో, మే నెలలో ఐదు మీటర్ల లోతులో ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యధిక భూగర్భ జల వినియోగ ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు పంట మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. రెండో పంటగా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులకు సూచించారు.

సమావేశంలో భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూగర్భ జలాల అంచనా విధానం, జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులను వివరించారు. అనంతరం 2024–25 సంవత్సరానికి సంబంధించిన భూగర్భ జలాల అంచనా నివేదికను జిల్లా కమిటీ ఆవిష్కరించింది.

Sthanikam

భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు అవసరం. అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News