Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:26 AM

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్

30-05-2026 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు డాక్టర్ ఎన్. అశోక్ కోరారు. ఈ మేరకు కేకే కమిటీ సభ్యుడు మోతే శోభన్‌రెడ్డిని కలిసి ఉద్యమకారుల సమస్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేలాది మంది ఉద్యమకారులు చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే ఉద్యమకారుల ఆత్మగౌరవానికి సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన బతుకమ్మ తల్లి కళాబృందం సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే మలిదశ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఆరోగ్య భద్రత కార్డులు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులకు అందిస్తున్న తరహాలో ప్రత్యేక రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించి న్యాయం చేయాలని మోతే శోభన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మోతే శోభన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Sthanikam

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి.డాక్టర్ ఎన్. అశోక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News