Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:27 AM

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

30-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: సీఐటీయూ ఆధ్వర్యంలో జనగాం జిల్లా కేంద్రంలోని గ్లోరీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ నాలుగో రాష్ట్ర మహాసభలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పాండును రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ రైస్‌మిల్లులు, గోదాములు, మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాలు, రైల్వే తదితర రంగాల్లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచడం లేదని, కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లోనూ యాజమాన్యాలు బాధ్యత వహించకపోవడంతో హమాలీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని దాసరి పాండు పేర్కొన్నారు.– దాసరి పాండు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్

Sthanikam

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దాసరి పాండు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News