Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 06:31 PM

అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?

అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?

అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?
31-07-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు పిల్లి రామరాజు..

పరిష్కరించకుంటే మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక..

నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 3వ డివిజన్ శేషమ్మగూడెం పాతపల్లెలో పేరుకుపోయిన స్థానిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

అంతకుముందు ఆయన 3వ డివిజన్ పరిధిలోని పాతపల్లె గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ.. పాతపల్లెలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిరుపయోగంగా మారిందని మురుగునీరు రోడ్డుపై పారుతుండటంతో శేషమ్మగూడెం, తానేధర్ పల్లి వైపు వెళ్లే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప వర్షానికే ప్రధాన రహదారి జలమయమవుతోందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలను పట్టించుకోవడంలో యంత్రాంగంతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రామరాజు విమర్శించారు.

తానేధర్ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నారని, గెలిచిన తర్వాత కనీసం గ్రామాల వైపు చూడటం లేదని ఆరోపించారు. హైదరాబాద్, క్యాంపు కార్యాలయాలకే పరిమితమై ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. పాతపల్లెలో వెంటనే కొత్త డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే స్థానిక ప్రజలతో కలిసి మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 3వ డివిజన్ ఇన్‌ఛార్జ్ శరత్, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

అభివృద్ధి పనుల హామీ ఏమైంది.?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News