Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:16 PM

విద్యుత్‌ కోతలపై బీఆర్‌ఎస్‌ ఆందోళన..

విద్యుత్‌ కోతలపై బీఆర్‌ఎస్‌ ఆందోళన..

విద్యుత్‌ కోతలపై బీఆర్‌ఎస్‌ ఆందోళన..
22-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జాతీయ రహదారిపై రాస్తారోకో..

మునగాల, సెప్టెంబర్‌ 22: విద్యుత్‌ కోతలకు నిరసనగా సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ముట్టడించాయి. అనంతరం విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతల కారణంగా పంట పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ కోతలను నిలిపివేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలని కోరారు.రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని బీఆర్‌ఎస్‌ శ్రేణులు హెచ్చరించాయి. ఈ ఆందోళనతో మునగాలలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Sthanikam

విద్యుత్‌ కోతలపై బీఆర్‌ఎస్‌ ఆందోళన..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News