Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:17 PM

సంస్కృతి ఉట్టిపడేలా.. పర్యావరణహితంగా గణేష్ నిమజ్జనం

22-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాలను భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు తలారి గణేష్ సూచించారు. గణేష్ ఉత్సవాలు దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

సంప్రదాయాలకు పెద్దపీట..

నిమజ్జనం సందర్భంగా డీజేలు, సౌండ్‌ బాక్సులు, బ్రాస్‌ బ్యాండ్లు, రీమిక్స్‌ పాటలతో అధిక శబ్దాలు చేస్తూ నృత్యాలు చేయడం కంటే భక్తిగీతాలు, భజనలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యాలు, భాజభజంత్రీలతో గణనాథుడిని సాగనంపాలని కోరారు. యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు.

కాలుష్యాన్ని నివారిద్దాం..

నిమజ్జనం సమయంలో టపాకాయలు కాల్చకుండా వాయు కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. విగ్రహాలను తరలించే వాహనాలను అవసరం లేని సమయంలో ఆపివేయడం ద్వారా పొగ కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు. పూజలో వినియోగించిన పూలు, పూలదండలు, కొబ్బరికాయలు, పండ్లు, కాగితాలు, పత్రి తదితరాలను నీటిలో వేయకుండా సంబంధిత గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ సిబ్బందికి అప్పగించాలని సూచించారు.

మంచినీటి వనరుల్లో విగ్రహాల నిమజ్జనం చేయకుండా జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా, పర్యావరణానికి హాని కలగకుండా గణేష్ నిమజ్జనం నిర్వహిద్దామని పిలుపునిచ్చారు.

Sthanikam

సంస్కృతి ఉట్టిపడేలా.. పర్యావరణహితంగా గణేష్ నిమజ్జనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News