భక్తుల రద్దీ వేళ అతివేగం.. పుణ్యక్షేత్రంలో విషాదం.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. కొండపై భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.
భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై వాహనాల వేగాన్ని నియంత్రించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి