Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 05:23 PM

న్యాయవాదుల సంక్షేమం కోసం నేడు ధర్నా.ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి

22-09-2026 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి

రామన్నపేట: న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన ప్రధాన డిమాండ్ల సాధన కోసం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టు కాంప్లెక్స్‌ల ఎదుట నిర్వహించనున్న ధర్నాలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రామన్నపేటలో నిర్వహించిన ఐలు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఐలు జాతీయ కౌన్సిల్‌ నిర్ణయం మేరకు ఈ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. న్యాయవాదుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కేంద్ర న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం–2001ను సవరించి న్యాయవాది మరణం లేదా పదవీ విరమణ సమయంలో రూ.25 లక్షలు అందించాలని, వైద్య సహాయంగా రూ.5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. జూనియర్‌ న్యాయవాదులకు కనీసం ఐదేళ్లపాటు నెలకు రూ.10 వేల స్టైపెండ్‌ ఇవ్వాలని కోరారు.

డిమాండ్ల సాధన కోసం నిర్వహించే ధర్నాను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు ఐక్యంగా పాల్గొనాలని వెంకట్‌రెడ్డి కోరారు. సమావేశానికి ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వంచ జగతయ్య అధ్యక్షత వహించారు. జిల్లా నాయకులు యాదాసు యాదయ్య, గడ్డం నరసయ్య, అంకం నరేష్, కిరణ్‌కుమార్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

న్యాయవాదుల సంక్షేమం కోసం నేడు ధర్నా.ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మామిడి వెంకట్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News