Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 07:14 PM

రైతన్నల కరెంట్ 'గోస'.. చౌటుప్పల్‌లో 'గులాబీ' గర్జన!

22-09-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

డిఈ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల నిరసన

లాగ్‌బుక్ వివరాలు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు డిమాండ్

రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే పోరాటం తప్పదు: ప్రభాకర్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం చౌటుప్పల్‌లోని విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ (డిఈ) కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.

​అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పంట పొలాలకు అవసరమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో బోర్లు, మోటార్లపై ఆధారపడిన రైతులు సాగునీరందక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. వ్యవసాయానికి రోజూ ఎన్ని గంటల పాటు విద్యుత్ ఇస్తున్నారో తెలిపే లాగ్‌బుక్ చూపించాలని కూసుకుంట్ల అధికారులను నిలదీశారు. అయితే లాగ్‌బుక్ వివరాలు వెంటనే చూపించని అధికారులు.. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తామని దాటవేసే ప్రయత్నం చేశారు. నిరసన తీవ్రం కావడంతో, ఇకపై రోజూ అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు హామీ ఇచ్చారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇదే కార్యాలయానికి వచ్చి రెండు గంటలే ఇస్తున్నారని ప్రశ్నించారని.. మరి ఇప్పుడు కనీసం ఆరు గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతున్నారా అని కూసుకుంట్ల ప్రశ్నించారు. "కేసీఆర్ కట్టిన ఇల్లు, ఏర్పరిచిన వ్యవస్థను పదేళ్లు విజయవంతంగా నడిపి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చాం. అదే వ్యవస్థను ఈ ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతోంది?" అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించి రైతుల సమస్యలు పరిష్కరించడం విడిచిపెట్టి, మంత్రుల చుట్టూ తిరగడానికే పరిమితమయ్యారని విమర్శించారు. ​రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, నారాయణపురం మండల అధ్యక్షుడు నర్రి నరసింహ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రైతన్నల కరెంట్ 'గోస'.. చౌటుప్పల్‌లో 'గులాబీ' గర్జన!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News