Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:10 PM

నల్గొండను 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్ది ​బెస్ట్ కార్పొరేషన్ అవార్డు అందుకోవడమే మన లక్ష్యం...

22-09-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండను 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దుతాం...

బెస్ట్ కార్పొరేషన్ అవార్డు అందుకోవడమే లక్ష్యం...

రూ.83 కోట్లతో నిరంతర తాగునీటి సరఫరా పనులు...

రూ.1.01 కోట్లతో స్వీపింగ్ యంత్రాలు ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...

నల్గొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రజలకు అన్ని రకాల ప్రాథమిక వసతులు కల్పించి 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్దడమే కాకుండా, రాష్ట్రంలోనే బెస్ట్ కార్పొరేషన్ అవార్డు సాధించేలా అభివృద్ధి చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ (మంత్రి క్యాంపు కార్యాలయం) ప్రాంగణంలో కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రత కోసం రూ.1.01 కోట్ల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన రెండు స్వీపింగ్ (వెట్టింగ్) యంత్రాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.. నూతనంగా ఏర్పాటైన నల్గొండ కార్పొరేషన్ ప్రజలకు 24 గంటల పాటు మంచినీటిని అందించడమే లక్ష్యంగా రూ.83 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు.

రూ.900 కోట్లతో ఓఆర్ఆర్...

పట్టణ మౌలిక వసతుల విస్తరణలో భాగంగా రూ.900 కోట్ల అంచనా వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఎస్‌డీఎఫ్ నిధులతో ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో 63 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగతా డివిజన్లలో కూడా త్వరలోనే రోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తి చేస్తామన్నారు. నగరంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనులను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల నల్గొండ కార్పొరేషన్ 'స్వచ్ఛ అవార్డు' దక్కించుకోవడం అభినందనీయమని, మున్ముందు అవసరమైన నిధులన్నీ తీసుకువచ్చి కార్పొరేషన్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణతో పాటు ఆర్అండ్‌బీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండను 'స్మార్ట్ సిటీ'గా తీర్చిదిద్ది ​బెస్ట్ కార్పొరేషన్ అవార్డు అందుకోవడమే మన లక్ష్యం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News