Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 07:14 PM

సూర్యాపేట హక్కు.. బుల్లెట్‌ ట్రైన్‌ రావడమే లక్ష్యం

22-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ రావడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా పాస్టర్ల సంఘం అధ్యక్షుడు మీసాల గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ ట్రైన్‌ సాధన కోసం చేపట్టిన 40వ రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేలా సంబంధిత ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సూర్యాపేటను విస్మరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పి. సామేల్‌ కిరణ్‌, నియోజకవర్గ అధ్యక్షుడు డేవిడ్‌ రాజ్‌ జలగం, పట్టణ అధ్యక్షుడు కే. కరుణాకర్‌, సూర్యాపేట రూరల్‌ అధ్యక్షుడు జి. సోలోమెన్‌ రాజ్‌, గౌరవ సలహాదారులు జాన్‌ మార్క్‌, బాబురావు, జీవరత్నం, లాజర్‌, ఏసుపాదం, ఏజ్రా, సుదర్శన్‌ రాజు, సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేట హక్కు.. బుల్లెట్‌ ట్రైన్‌ రావడమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News