నిరుపేద కుటుంబానికి రూ.10 వేల అందజేత
పిల్లల చదువు బాధ్యతా తీసుకుంటానని ‘మల్లేష్ గౌడ్’ హామీ
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డిగూడేనికి చెందిన తీగల శేఖర్ గౌడ్ అకాల మరణం చెందడంతో, ఆయన నిరుపేద కుటుంబాన్ని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తొర్పునూరి మల్లేష్ గౌడ్ పరామర్శించారు. శేఖర్ గౌడ్ మృతితో ఆయన భార్య, ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారన్న విషయం తెలుసుకున్న మల్లేష్ గౌడ్.. మంగళవారం ఆ కుటుంబాన్ని కలిసి తన వంతుగా రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లల చదువులకు భవిష్యత్తులోనూ తగిన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆసరాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, సుర్కంటి శంకర్ రెడ్డి, ఉష్కాగుల సురేష్ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, తొర్పునూరి బాల నరసింహ, ఉష్కాగుల అరుణ్ గౌడ్, తొర్పునూరి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి