వన మహోత్సవం సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలోని తుంగతుర్తి, వెంపటి, గొట్టిపర్తి గ్రామంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో సీఐ ఉపేందర్ ,ఎస్సై క్రాంతి కుమార్ ,గ్రామ సర్పంచులతో కలిసి పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం సిఐ ఉపేందర్, ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ..."మొక్కలు నాటడం మన అందరి బాధ్యతని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని
సంరక్షించాలన్నారు. నేడు నాటే మొక్కలే రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తాయి" అని అన్నారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచులు, పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి