Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నాయకత్వం హోదా కాదు.. బాధ్యత – నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 10:48 PM

రేపటితో ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. తల్లిపాలపై అవగాహన పెంపొందిద్దాం

రేపటితో ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. తల్లిపాలపై అవగాహన పెంపొందిద్దాం

రేపటితో ప్రారంభమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు.. తల్లిపాలపై అవగాహన పెంపొందిద్దాం
July 31, 2026 08:55 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి తల్లి తన శిశువుకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలని సూచించారు. పుట్టిన వెంటనే వచ్చే తొలి పాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంచే అమూల్యమైన ఆహారమని తెలిపారు. మొదటి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు అందడంతో పాటు విరేచనాలు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెప్పారు. తల్లిపాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడటంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది తల్లిపాల వారోత్సవం "జీవితానికి స్థిరమైన ప్రారంభం కోసం తల్లిపాలు – ఇప్పటికే ఫలితాలిస్తున్న చర్యలను మరింత బలోపేతం చేద్దాం" అనే అంశంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, బాలింతలకు అవసరమైన సహకారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి తోడ్పడాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News