Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

ఒకే సర్టిఫికెట్‌తో కుటుంబానికి ప్రభుత్వ గుర్తింపు! తెలంగాణలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రారంభం

31-07-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, జూలై 31 : రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు పొందేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని తహశీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాలు లేదా మీసేవా కేంద్రాల ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఈ సర్టిఫికెట్లో కుటుంబ సభ్యుల పేర్లు, వారి పరస్పర సంబంధాలు తదితర అధికారిక వివరాలు నమోదు చేయబడతాయి. ప్రభుత్వ శాఖల్లో కుటుంబ వివరాల ధ్రువీకరణ అవసరమయ్యే అన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఈ విధానం అమలుతో ప్రజలు ఒకే ధ్రువపత్రం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Sthanikam

ఒకే సర్టిఫికెట్‌తో కుటుంబానికి ప్రభుత్వ గుర్తింపు! తెలంగాణలో 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రారంభం

Article Image

హైదరాబాద్, జూలై 31 : రాష్ట్రంలో పౌర సేవలను మరింత సులభతరం చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యామిలీ సర్టిఫికెట్' జారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ ప్రభుత్వ సేవలు పొందేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమకు సమీపంలోని తహశీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయాలు లేదా మీసేవా కేంద్రాల ద్వారా ఈ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

ఈ సర్టిఫికెట్లో కుటుంబ సభ్యుల పేర్లు, వారి పరస్పర సంబంధాలు తదితర అధికారిక వివరాలు నమోదు చేయబడతాయి. ప్రభుత్వ శాఖల్లో కుటుంబ వివరాల ధ్రువీకరణ అవసరమయ్యే అన్ని సందర్భాల్లో ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

ఈ విధానం అమలుతో ప్రజలు ఒకే ధ్రువపత్రం ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News