యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె. నాగమ్మ తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థినులు ఆగస్టు 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బోనాఫైడ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా జత చేయాలని పేర్కొన్నారు.దరఖాస్తు చేసిన విద్యార్థినులకు ఆగస్టు 5వ తేదీ ఉదయం 10 గంటలకు పాఠశాల ప్రాంగణంలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి