Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:02 PM

నాయకత్వం హోదా కాదు.. బాధ్యత – నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ

31-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థి నాయకులకు బాధ్యతల పట్టాభిషేకం.

సెంట్ జాన్సన్ స్కూల్‌లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెరిమనీ.

హైదరాబాద్/నాగోలు:

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సేవాభావం, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించే లక్ష్యంతో నాగోలులోని సెంట్ జాన్సన్ స్కూల్‌లో శుక్రవారం ఇన్వెస్టిచర్ సెరిమనీని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్థి క్యాబినెట్‌కు బాధ్యతలు అప్పగించి, బ్యాడ్జీలు, సాష్‌లు అందజేశారు.

పాఠశాల ప్రిన్సిపాల్ రామ్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మమతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఆకట్టుకునే మార్చ్‌పాస్ట్‌తో అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌తో పాటు హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, ప్రిఫెక్ట్‌లు బాధ్యతల స్వీకార ప్రమాణం చేశారు. పాఠశాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా నాగోలు పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ మాట్లాడుతూ.. "నాయకత్వం అనేది పదవి కాదు.. బాధ్యత. మంచి నాయకుడు తన మాటలతో కాదు, ఆచరణతో ఆదర్శంగా నిలవాలి. క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావం అలవర్చుకున్న విద్యార్థులే రేపటి సమాజాన్ని నడిపించే నాయకులవుతారు" అని పేర్కొన్నారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, బాధ్యతను, సేవా దృక్పథాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

ఎస్ ఐ శివ నాగ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి నాయకులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తూ పాఠశాలలో క్రమశిక్షణ, ఐక్యత, సహకార భావనను బలోపేతం చేయాలని సూచించారు.

Sthanikam

నాయకత్వం హోదా కాదు.. బాధ్యత – నాగోలు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News