Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

కోదాడ కోర్టు ను మోడల్ కోర్టు గా తీర్చిదిద్దేందుకు కృషి.....

31-07-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోర్టు ఫైళ్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యాక కోదాడను మోడల్ కోర్టుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. శుక్రవారం కోదాడలో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను ఒకటవ అదనపు జిల్లా జడ్జి శివరాం ప్రసాద్‌తో కలిసి తనిఖీ చేశారు. భవన నిర్మాణ పురోగతిని పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కోర్టు హాల్లో జరిగిన సమావేశంలో సబ్ జడ్జి సురేష్,ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య, బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.కోదాడలో కోర్టు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేసుల డిజిటలైజేషన్ వేగవంతం చేసి, వ్యాజ్యదారులకు సత్వర న్యాయం అందించేలా కోదాడ కోర్టును ఆదర్శంగా నిలుపుతామన్నారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను వేగవంతం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమూర్తులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ,జాయింట్ సెక్రటరీ జానీ పాషా, మహిళా ప్రతినిధులు ధనలక్ష్మి, హేమలత, దుర్గ, సీనియర్ న్యాయవాదులు సుధాకర్ రెడ్డి, ఎస్ ఆర్ కే మూర్తి, దేవపత్తిని నాగార్జున, పాలేటి నాగేశ్వరరావు, రహీం, ఈ కే యాదవ్, శరత్ బాబు, నాగు బండి కృష్ణమూర్తి, యడ్లపల్లి వెంకటేశ్వర్లు, చింతకుంట్ల రామిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సీతారామరాజు, చలం, నాగుల్ పాషా, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు..........

Sthanikam

కోదాడ కోర్టు ను మోడల్ కోర్టు గా తీర్చిదిద్దేందుకు కృషి.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News