Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్

31-07-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిర్వహించనున్న తపస్ మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు, కనీస వేతన స్కేలు అమలు తదితర ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.

అలాగే జీవో నెం.25 సవరణ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి అమలు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారం, విద్యాశాఖలో జీవో 190 అమలు, 317 బాధితులకు ఉపశమనం, 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, టెట్ అర్హత మార్కులను 40 శాతానికి నిర్ణయించడం, విద్యాసంస్థలకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధుల విడుదల వంటి డిమాండ్ల సాధన కోసం ప్రతి ఉపాధ్యాయుడు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

Sthanikam

నేడు ఇందిరా పార్క్ వద్ద తపస్ మహాధర్నాకు తరలిరండి. జిల్లా ఉపాధ్యాయులకు కోట్ల కాశీరావు, పూజారి రమేశ్

Article Image

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శనివారం నిర్వహించనున్న తపస్ మహాధర్నాను విజయవంతం చేయాలని తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కోట్ల కాశీరావు, ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహాధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు, సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల మంజూరు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లింపు, కనీస వేతన స్కేలు అమలు తదితర ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు.

అలాగే జీవో నెం.25 సవరణ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్ధతి అమలు, గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారం, విద్యాశాఖలో జీవో 190 అమలు, 317 బాధితులకు ఉపశమనం, 2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల రెగ్యులరైజేషన్, టెట్ అర్హత మార్కులను 40 శాతానికి నిర్ణయించడం, విద్యాసంస్థలకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిధుల విడుదల వంటి డిమాండ్ల సాధన కోసం ప్రతి ఉపాధ్యాయుడు మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News