Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి

31-07-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చిన్న కొండూర్ లో నిఘా నేత్రాల ప్రారంభం

నేరాల నివారణతో పాటు గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చిన్న కొండూర్ గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల సమక్షంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, సీఐ జి. మన్మధ్ కుమార్, ఎస్ఐ ఎస్. కృష్ణ మాల్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ​అనంతరం జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... దొంగతనాలు, ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలపై నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఉంటుందన్నారు. నిఘా నేత్రాలు గ్రామానికి కళ్ల లాంటివని, ప్రజల్లో భద్రతా భావనను పెంపొందిస్తాయని చెప్పారు. "ప్రజల సహకారమే పోలీసుల బలం" అని, గ్రామాన్ని సురక్షితంగా ఉంచుకోవడంలో చౌటుప్పల్ పోలీసులకు గ్రామ పంచాయతీ, ప్రజలు అందిస్తున్న సహకారం ఆదర్శనీయమని కొనియాడారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పాల్గొన్నారు.

Sthanikam

గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News