Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

కోదాడలో ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం...

31-07-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ప్రతి దళితుడికి అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షల చొప్పున ఆర్థిక సాయం తక్షణమే అందించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ, జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ లు డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో నియోజకవర్గ అధ్యక్షులు బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, అసలు ఈ కార్పొరేషన్ ద్వారా ఎంతమంది దళితులకు లబ్ధి చేకూర్చారో ప్రభుత్వం బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో దళితులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. ప్రస్తుత కాలంలో రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం ఏమాత్రం సాధ్యం కాదని, ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గత 32 ఏళ్లుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసి జైలుపాలైన, అమరులైన ఉద్యమకారుల కుటుంబాలకు పింఛన్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు

కనుక జానయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు విజయభాస్కర్, రాష్ట్ర కార్యదర్శి మిద్దె వెంకన్న, ముక్కంటి, పెడమర్తి వెంకట్,కడప పెంటయ్య, బల్గురు హుస్సేన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వంగాల వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి నాగేశ్వర రావు,కష్టాల సైదులు, రవీందర్, జిల్లా నాయకులు పోలంపల్లి శ్రీను, మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్, వినోద్, లింగయ్య, మహేష్, కత్తి లింగయ్య, సైదులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.....

Sthanikam

కోదాడలో ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News