Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

శేష జీవితం సంతోషంగా గడపాలి: రిటైర్డ్ పోలీసులకు సీపీ సుమతి సూచన

01-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి, జూలై 31:

పోలీసు శాఖలో ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన పోలీసు అధికారులను శుక్రవారం సీపీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ జీవితంలో పోలీసు శాఖకు అందించిన సేవలు, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రిటైర్డ్ ఉద్యోగులు తమ అనుభవాన్ని సమాజ సేవకు వినియోగించాలని, ఆరోగ్యంగా ఉంటూ సమాజానికి తమ వంతు సేవలు కొనసాగించాలని సూచించారు. వారి నిబద్ధత, సేవాభావానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ నరసింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ (అడ్మిన్) రవీందర్ రెడ్డి, సీఏఓలు శ్రీనివాస్, శ్రీనివాస్, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్. భద్రారెడ్డి, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

శేష జీవితం సంతోషంగా గడపాలి: రిటైర్డ్ పోలీసులకు సీపీ సుమతి సూచన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News