హైదరాబాద్, వనస్థలిపురం: సాహెబ్‌నగర్‌కు చెందిన హాజీముల్లా కుమారుడు మహమ్మద్ అలీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు అప్రమత్తమయ్యారు.
వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు ఎస్‌ఐలు నాగరాజు, రవి నాయక్ పర్యవేక్షణలో పోలీస్ కానిస్టేబుల్ బి. రాజేందర్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాలను వినియోగిస్తూ చేపట్టిన గాలింపు చర్యల్లో కేవలం అరగంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల వేగవంతమైన స్పందనతో ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకోగా, సీసీ కెమెరాల సహాయంతో చాకచక్యంగా బాలుడి ఆచూకీ కనిపెట్టిన వనస్థలిపురం పోలీసులను స్థానికులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి