Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

టీటీడీ భూమిపై కబ్జా నీడ..! వెంచర్ పేరుతో ప్లాట్ల విక్రయాలు?

01-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం భూమిపై ఆక్రమణల నీడలు కమ్ముకున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం స్వామివారి కళ్యాణమండపం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని, ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమ ఆధీనంలోకి తీసుకుని వెంచర్‌గా మార్చి ప్లాట్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

​అసలేం జరిగింది.

​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో టీటీడీ కళ్యాణమండపం నిర్మాణం కోసం సుమారు 22 సంవత్సరాల క్రితం భూమిని విక్రయించారు. 2024లో ఈ భూమిలో అక్రమ నిర్మాణం జరగగా ఆ నిర్మాణాలను గమనించిన ఈ భూమిని విక్రయించిన అసలు యజమానులు, తాము టీటీడీకి స్థలాన్ని అప్పగించినట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత పత్రాలు, సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు , గుత్తా సుఖేందర్ రెడ్డికి , జిల్లా కలెక్టర్ కు , మండల రెవెన్యూ అధికారికి ఈ వినతి పత్రాన్ని సమర్పించారు.

​ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కాకపోవడమే ఈ అక్రమాలకు కారణమా ?

​టీటీడీ పేరిట భూమి ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు అనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపుతూ కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి అనుమతులు లేకపోయినా, ఆ భూమిలో ఏకంగా వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లుగా విక్రయిస్తుండడం గమనార్హం. టీటీడీ భూమికి వెంచర్ అనుమతులు ఎలా వచ్చాయనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే వీరు సమర్పించిన వినతి పత్రాలలో దేవాలయ భూమిని ఎప్పుడూ వీలుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తామని సదరు వ్యక్తులు ఇచ్చిన వినతి పత్రంలో తెలియజేశారు. అది కూడా గమనించకపోవడం విడ్డూరంగా అనిపిస్తోందని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు..

​అధికారుల సమగ్ర విచారణకు డిమాండ్.

​ఈ అక్రమ వ్యవహారంపై రెవెన్యూ, మున్సిపల్, టీటీడీ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న టీటీడీ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. భూ యాజమాన్య హక్కులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆక్రమణలు నిజమని తేలితే వెంటనే ప్లాట్ల విక్రయాలను అడ్డుకుని టీటీడీ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

టీటీడీ భూమిపై కబ్జా నీడ..! వెంచర్ పేరుతో ప్లాట్ల విక్రయాలు?

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News