Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు

01-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇబ్రహీంపట్నం: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలను గడువులోగా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ (డీటీడీఓ) కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝళిపించింది. సంబంధిత పీఐఓకు రూ.5 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం దరఖాస్తు ద్వారా కోరినా, నిర్ణీత గడువులోగా సమాచారం అందించలేదు. అనంతరం మొదటి అప్పీల్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సమాచార హక్కు చట్టం ప్రకారం ద్వితీయ అప్పీల్ దాఖలైంది.

ఈ అప్పీల్‌పై శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార హక్కు భవన్‌లో రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ విచారణ చేపట్టారు. అప్పీలుదారుగా సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు.

విచారణ సందర్భంగా ప్రజా సమాచార అధికారి నిర్లక్ష్య వైఖరిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకపోవడం ద్వారా దరఖాస్తుదారుడి చట్టబద్ధ హక్కుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారికి రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు, వారం రోజుల్లో జరిమానా చెల్లించాలని, అప్పీలుదారు కోరిన పూర్తి సమాచారాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా వెంటనే అందజేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కాట్రావత్ రాజు నాయక్ మాట్లాడుతూ, సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసే అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం ఆర్టీఐ చట్టం అమలుకు బలాన్నిస్తుందని పేర్కొన్నారు.

Sthanikam

సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News