Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

శోభనాద్రిపురంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహణ రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి: సర్పంచ్ కంచి మధుసూదన్

01-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంచి మధుసూదన్ మాట్లాడుతూ గ్రామంలో కుల, మత వివక్షలకు ఎలాంటి తావు లేకుండా అందరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులను ప్రతి పౌరుడు గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పరస్పర సహకారం, సామరస్యంతో గ్రామానికి మంచి పేరు తీసుకువస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.

అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జలసిరి కార్యక్రమం ప్రాధాన్యం, గ్రామంలో చేపట్టాల్సిన చర్యలు, వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సర్పంచ్ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్సై సతీష్ గోపతి, మండల ఆర్‌ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్, జీపీఓ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

శోభనాద్రిపురంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహణ రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి: సర్పంచ్ కంచి మధుసూదన్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కంచి మధుసూదన్ మాట్లాడుతూ గ్రామంలో కుల, మత వివక్షలకు ఎలాంటి తావు లేకుండా అందరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులను ప్రతి పౌరుడు గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పరస్పర సహకారం, సామరస్యంతో గ్రామానికి మంచి పేరు తీసుకువస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.

అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జలసిరి కార్యక్రమం ప్రాధాన్యం, గ్రామంలో చేపట్టాల్సిన చర్యలు, వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సర్పంచ్ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్సై సతీష్ గోపతి, మండల ఆర్‌ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్, జీపీఓ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థాయి లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News