Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

01-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్: హయత్‌నగర్–తారమతిపేట్ 100 అడుగుల రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు. శుభోదయ కాలనీకి చెందిన బాధితులతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మదర్ డెయిరీ సమీపంలో ప్రభుత్వం గతంలో కేటాయించిన 60 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణతో తమ ఇళ్లు పూర్తిగా ప్రభావితమవుతున్నాయని, దీంతో వందకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎదురుగా ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి వైపు నుంచి విస్తరణ చేపట్టి తమ ఇళ్లను కాపాడాలని ఎంపీని కోరారు.

వినతిని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి ఇళ్లు, జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శుభోదయ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బాధిత కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు విస్తరణలో బాధితులకు న్యాయం చేయాలి. ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

Article Image

హయత్‌నగర్: హయత్‌నగర్–తారమతిపేట్ 100 అడుగుల రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కోరారు. శుభోదయ కాలనీకి చెందిన బాధితులతో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మదర్ డెయిరీ సమీపంలో ప్రభుత్వం గతంలో కేటాయించిన 60 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదిత 100 అడుగుల రోడ్డు విస్తరణతో తమ ఇళ్లు పూర్తిగా ప్రభావితమవుతున్నాయని, దీంతో వందకు పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎదురుగా ఉన్న ఖాళీ ప్రభుత్వ భూమి వైపు నుంచి విస్తరణ చేపట్టి తమ ఇళ్లను కాపాడాలని ఎంపీని కోరారు.

వినతిని స్వీకరించిన ఎంపీ ఈటల రాజేందర్.. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయకుండా, వారి ఇళ్లు, జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. శుభోదయ కాలనీ వాసులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బాధిత కుటుంబాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News