Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి

01-08-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకొని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి అన్నారు. రామన్నపేట మండల పరిధిలోని వెల్లంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని, సమస్యలు ఎదురైనప్పుడు చట్టబద్ధంగా పరిష్కారం పొందే దిశగా అడుగులు వేయాలన్నారు.విద్యా హక్కు చట్టం, బాల కార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎలాంటి సమస్య ఎదురైనా స్థానిక పోలీస్‌స్టేషన్ లేదా మండల న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని, ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగాలని, హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఏ మజీద్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్లు మొగలయ్య, ఎన్. స్వామి, ప్యానల్ అడ్వకేట్లు కూనూరు శ్రీనివాస్, సోమ శ్రీనివాస్ రెడ్డి, పాల్వంచ జగతయ్య, నరసింహ, ఎంఏ అజీమ్, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యుడు బత్తుల గణేష్, అగ్రి క్లినిక్ సభ్యుడు కానుగంటి శ్రీశైలం, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అదనపు జూనియర్ సివిల్ జడ్జి వి. రత్నకుమారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News