40 ఏళ్ల సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం. వారాసిగూడలో నేడు గంగపుత్రుల బోనాల సందడి. 100 బోనాలతో భూలక్ష్మి ఆలయం నుంచి కట్ట మైసమ్మ వరకు శోభాయాత్ర
40 ఏళ్ల సంప్రదాయానికి మళ్లీ శ్రీకారం. వారాసిగూడలో నేడు గంగపుత్రుల బోనాల సందడి. 100 బోనాలతో భూలక్ష్మి ఆలయం నుంచి కట్ట మైసమ్మ వరకు శోభాయాత్ర
Vaddeman Suresh
పూజా సామగ్రి ఉచితం.. గంగపుత్రులందరికీ నిర్వాహకుల పిలుపు.
సికింద్రాబాద్
: వారాసిగూడ గంగపుత్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గంగపుత్రులు నిర్వహించిన సంప్రదాయ బోనాల వేడుకను తిరిగి పునరుద్ధరిస్తుండటంతో సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గంగపుత్ర సంఘాలు, సొసైటీలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో పాల్గొననున్నారు. వారాసిగూడ భూలక్ష్మి దేవాలయం నుంచి చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయం వరకు సుమారు 100 బోనాలతో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.
అమ్మవారికి సమర్పించే బోనాల కోసం అవసరమైన బిందెలు, పూజా సామగ్రిని గంగపుత్ర జేఏసీ ఉచితంగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గంగపుత్రులందరూ కుటుంబ సమేతంగా హాజరై బోనాల ఉత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. భక్తిశ్రద్ధలతో పాటు పాత సంప్రదాయాలకు ప్రతీకగా ఈ వేడుక నిలవనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి