Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

01-08-2026 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తొలిరోజు ఘనంగా అఖండ దీపారాధన, గణపతి పూజ

మండల పరిధిలోని ప్రసిద్ధ శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో అఖండ దీపారాధన, గణపతి పూజలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ (ఏసీ) కె. భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈవో) సల్వాది మోహన్ బాబు, కంచర్ల అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

తొలిరోజు దేవస్థానానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు దాతలు కొమిరిశెట్టి విజయ్ కుమార్ - శిరీష దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని సమకూర్చారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈడుదుల బాబు, బేతాళ నరసింహ, సిద్దిపేట ఆనందరెడ్డి, వెంకిర్యాల శివ, బాలగోని శ్రీకాంత్ గౌడ్, బొంతల యువరాజ్, మన్నే మహేందర్ రెడ్డి, దౌడీ రాజేష్, పన్నాల మహేందర్ రెడ్డి, ధేప రాజీవ, పంతంగి రమేష్, జొన్నగంటి దాసు, చిట్టెంపల్లి సబిత, వల్లూరి శివప్రసాద్ శర్మ, గ్రామ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Sthanikam

ఆందోల్‌ మైసమ్మ క్షేత్రంలో కన్నులపండువగా బోనాల ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News