Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:06 PM

సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష

01-08-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శిరీష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు.

భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో (POCSO) చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ఉచిత న్యాయ సహాయం, న్యాయాన్ని పొందే హక్కు, సైబర్ భద్రత వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్ విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాలల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి చట్టాలపై ఆసక్తి పెంపొందించారు.

కార్యక్రమం ముగింపులో జూనియర్ సివిల్ జడ్జి శిరీష విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, సరైన సమాధానాలు చెప్పిన వారికి ప్రోత్సాహకంగా పెన్నులు బహూకరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యుడు శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

Sthanikam

సిరిపురం జెడ్పీహెచ్‌ఎస్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు.విద్యార్థులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించిన జూనియర్ సివిల్ జడ్జి శిరీష

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి శిరీష ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు.

భారత రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులు, బాలల హక్కులు, బాలల రక్షణ చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పోక్సో (POCSO) చట్టం, మంచి స్పర్శ–చెడు స్పర్శ, మాదకద్రవ్యాల దుర్వినియోగ నివారణ, ఉచిత న్యాయ సహాయం, న్యాయాన్ని పొందే హక్కు, సైబర్ భద్రత వంటి అంశాలను సులభంగా అర్థమయ్యేలా వివరించారు.

అనంతరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుక్క శ్రవణ్ కుమార్ విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, బాధ్యతలు, సైబర్ నేరాల నుంచి రక్షణ, బాలల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి చట్టాలపై ఆసక్తి పెంపొందించారు.

కార్యక్రమం ముగింపులో జూనియర్ సివిల్ జడ్జి శిరీష విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నించి, సరైన సమాధానాలు చెప్పిన వారికి ప్రోత్సాహకంగా పెన్నులు బహూకరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ సభ్యుడు శ్రీశైలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి సదస్సులు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News