శ్రీ గాయత్రీ కళాశాలలో ఘనంగా ‘గోరింటాకు సంబరాలు’
శ్రీ గాయత్రీ కళాశాలలో ఘనంగా ‘గోరింటాకు సంబరాలు’
K.RAVI
సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసిన విద్యార్థినిలు
శ్రీ గాయత్రీ జూనియర్ కళాశాలలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శనివారం గోరింటాకు సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు రంగురంగుల సాంప్రదాయ దుస్తులు ధరించి, చేతులకు అందమైన గోరింటాకు డిజైన్లను అలంకరించుకుని కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపారు. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ఛైర్మన్ బండారు మయూర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ... గోరింటాకు మన తెలుగు సంస్కృతికి, ఆనందానికి ప్రతీక అని పేర్కొన్నారు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందనే శాస్త్రీయ దృక్పథం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు.వేడుకల్లో భాగంగా విద్యార్థినిల ఆటపాటలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మారగోని దయాకర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి