Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:07 PM

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: తపస్ నాయకుల డిమాండ్

01-08-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) పిలుపు మేరకు నారాయణఖేడ్ డివిజన్ పరిధికి చెందిన ఉపాధ్యాయులు శనివారం "ఛలో హైదరాబాద్" మహా ధర్నాకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ గడువు ముగిసినా కొత్త పీఆర్సీ ప్రకటించలేదని తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, 100 విడతల ఏరియర్స్, జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ బిల్లులు, హెల్త్ కార్డులు తదితర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మూడు సంవత్సరాలు గడిచినా ఈ సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర సేవా కో-కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా నాయకులు వినయ్, లక్ష్మణ్, రామకృష్ణ, డివిజన్ అధ్యక్షుడు జగదీశ్వర్, మండలాల బాధ్యులు మచ్చందర్, మహేశ్, సంతోష్ రెడ్డి, రంజిత్, శ్రీను, ఓం బసవ, రతన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వం హామీలు అమలు చేయాలి: తపస్ నాయకుల డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News